రానా ‘విరాటపర్వం’ నుంచి కీలక అప్డేట్

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమా రిలీజ్ డేట్లను మేకర్స్ ఇప్పుడే ప్రకటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా వరుసగా అన్ని సినిమా రిలీజే డేట్స్ వస్తున్నాయి. RRR, ఆచార్య, పుష్ప , గని, సిటీమార్ రిలీజ్ డేట్లు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా రానా నటిస్తున్న విరాట పర్వం రిలీజ్ డేట్ గురించి ఒక అప్డేట్ వచ్చింది.

RANA VIRATAPARVAM RELEASE DATE

విరాటపర్వం రిలీజ్ డేట్‌ను ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు ప్రకటించనున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. ఈ రోజు సాయంత్రం 5.04 గంటలకు విరాటపర్వం రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నాం.. వేచి చూడండి అంటూ సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. రానా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. వేణు ఊడుగుల ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.