అనసూయకు రానా సపోర్ట్

హాట్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమా తెరకెక్కుతోంది తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను హీరో రానా విడుదల చేశాడు. ఈ పోస్టర్ లో ఓ లిఫ్ట్ దాని ఎదురుగా ఫ్లోర్ మీద పడి ఉన్న మాస్క్ కనిపిస్తున్నాయి. చూడటానికి ఈ పోస్టర్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో రానా షేర్ చేశాడు.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ ‌ను కూడా విడుదల చేయనున్నారు.

సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా.. గుణ బాలసుబ్రమణియన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. వైవా హర్ష,- అర్చనా అనంత్ , అనీష్ కురువిల్లా, మౌనికా రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, కాదంబరి కిరణ్, అన్నపూర్ణ, బాబీ రాఘవేంద్ర, సమీర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు.