రానా VS నాగ – మీరు ఎవరి వైపు వుంటారు?
యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘రాణా నాయుడు’ హై ఆక్టేన్ ట్రైలర్‌ను విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్

-‘రానా నాయుడు’లో నిజ జీవితంలో బాబాయ్ అబ్బాయి, వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి తండ్రీ కొడుకులుగా అలరిస్తున్నారు.

ముంబై, ఫిబ్రవరి 15, 2023: రానా నాయుడుకి సెలబ్రిటీలు, వివాదాలు, గాయాలు పెద్ద విషయం కాదు – కానీ అతని తండ్రి? అది వేరే కథ ! నెట్‌ఫ్లిక్స్ నుంచి రాబోయే సిరీస్ ‘రానా నాయుడు’ ఇండియన్ సూపర్‌స్టార్‌లలో ఇద్దరు రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి మొదటిసారిగా తండ్రీకొడుకుల కలిసి వస్తున్న హై-ఆక్టేన్, యాక్షన్-ప్యాక్డ్ రైడ్‌కి సిద్ధంగా ఉండండి. ప్రసిద్ధ అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కు ఎడాప్ట్టేషన్ అయిన రానా నాయుడు ప్రీమియర్ మార్చి 10, 2023న ప్రిమియర్ అవుతుంది. దీనిని సుందర్ ఆరోన్ లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించారు. ఇండియా కోసం కరణ్ అన్షుమాన్ రూపొందించారు. ఈ సిరీస్‌కి కరణ్ అన్షుమాన్ & సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహించారు. రానా ఒక అల్టిమేట్ సెలబ్రిటీ ఫిక్సర్ అయినప్పటికీ అతని తండ్రి నాగతో పెద్ద సమస్యతో వుంది.

వెంకటేష్ దగ్గుబాటి ఇంటెన్స్ పాత్రలో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసాదారణ శక్తితో మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ని అందిస్తూ మరింత ఆసక్తిని పెంచారు. అతని పాత్ర చిత్రీకరణ అసాధారణంగా వుంది. వెంకటేష్ పోషించిన నాగ పాత్ర హైదరాబాదీ తేజ్ దమ్ కా చాయ్ లాగా ఉంది – ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీ, నో టెన్షన్!

పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌ను ఆవిష్కరించడానికి రానా నాయుడు సిరీస్ తారాగణం కలిసి వచ్చింది. ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థితో పాటు కరణ్ అన్షుమాన్, సుపర్ వర్మ, సుందర్ ఆరోన్, మోనికా షెర్గిల్, విపి కంటెంట్, నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా పాల్గొన్నారు. భారీ అభిమానుల సందడి, ఉత్సాహం మధ్య ఈ యాక్షన్ థ్రిల్లర్ మసాలా ఎంటర్‌టైనర్ నుండి ప్రేక్షకులు ఏమి ఆశించాలో ఒక గ్లింప్స్ రూపొందించారు.

రానా దగ్గుబాటి తన బాబాయ్, నెట్‌ఫ్లిక్స్‌తో మొదటిసారి కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ చాలా కారణాల వల్ల ప్రత్యేకమైనది. ఇది నెట్‌ఫ్లిక్స్‌తో బాబాయ్ వెంకీతో నా మొదటి కొలాబరేషన్ . ఈ ప్రాజెక్ట్‌లో సుందర్ (ఆరోన్,) కరణ్ (అన్షుమాన్) సుపర్ణ్ (వర్మ)తో కలిసి పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. రానా నాయుడు దానిని అందించినందుకు సంతోషిస్తున్నాను. మొత్తం తారాగణం, టీం ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. రానా నాయుడు పాత్రను పోషించడం ఒక సవాలుగా అనిపించింది. అతను తన కుటుంబంతో లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్న సంక్లిష్టమైన పాత్ర, అదే సమయంలో తన తండ్రితో అతని సంబంధంతో కూడా పోరాడే పాత్ర. రానా, నాగ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రపంచాన్ని అందరూ ఎక్స్ పీరియన్స్ చేయడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అన్నారు.

వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ .. ‘రానా నాయుడు’ లాంటి ఎగ్జైటింగ్ షో కోసం మొదటిసారిగా మా అన్నయ్య గారి అబ్బాయితో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు థ్రిల్‌గా అనిపించింది. నాగ పాత్రను పోషించడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. నేను ఇంతకు ముందు ఇలాంటి పాత్రలో నటించలేదు. నాగ ఒక రిఫ్రెష్ చేంజ్. ఈ పాత్ర తెలివైన, ఆకర్షణీయమైన లేయర్లుగా వుంటుంది. నా అభిమానులు ఏం చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు చాలా విధాలుగా కొత్తది. ఈ సిరీస్‌లో ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాతల బృందంతో కలిసి పనిచేయడం నిజంగా అద్భుతమైన అనుభవం.

షోరన్నర్ కరణ్ అన్షుమాన్ మాట్లాడుతూ, “ఈ కథా ప్రయాణంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. రానా నాయుడు పట్ల ప్రేక్షకులు మా ఉత్సాహాన్ని పంచుకుంటారని ఆశిస్తున్నాను.సుందర్‌ , సుపర్న్, మిగిలిన బృందం కలసి పని చేయడం ఎంతో మంచి అనుభవం. ఈ సిరిస్ లో కుటుంబం, అధికారం, నైతికత అంతర్భాగం – ఒక ప్రత్యేకమైన తండ్రి-కొడుకుల బంధం థీమ్‌ . అలాగే హై -స్టేక్స్ యాక్షన్, సీట్ ఎడ్జ్ డ్రామా, కొన్నిచక్కని రచన, అత్యుత్తమ ప్రదర్శనలతో నిరంతరం బౌండరీలని దాటుతుంది. కొన్ని బిగ్ సర్ ప్రైజ్ లకు సిద్ధంగా ఉండండి!” అన్నారు

మోనికా షెర్గిల్, విపి – కంటెంట్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా మాట్లాడుతూ “రానా దగ్గుబాటి , వెంకటేష్ దగ్గుబాటిలని మొదటిసారి కలసి స్క్రీన్‌పై తండ్రీ కొడుకులుగా అద్భుతంగా చేసిన ప్రదర్శన ‘రానా నాయుడు’ మా ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అద్భుతమైన తారాగణం, థ్రిల్లింగ్ ప్లాట్ ట్విస్ట్‌లతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ డ్రామా ఈ రానా వర్సెస్ నాగ యుద్ధం మన ప్రేక్షకుల ఒక పక్షం వహించేలా చేస్తుంది. మీరు రానా లేదా నాగ ఎవరి వైపు ఉంటారు?

సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న సమిష్టి తారాగణం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని ప్రామిస్ చేస్తుంది.

రానా నాయుడు మార్చి 10, 2023న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలౌతుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో అందుబాటులో వుంటుంది

ప్రొడక్షన్ హౌస్: లోకోమోటివ్ గ్లోబల్
షోరన్నర్: కరణ్ అన్షుమాన్
దర్శకత్వం : కరణ్ అన్షుమాన్ / సుపర్ణ్ వర్మ
నిర్మాత: సుందర్ ఆరోన్
తారాగణం: రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్ తదితరులు