Rana: మ‌రోసారి రానా-మిహీక ఎయిర్‌పోర్టులో..

Rana: రానా-మిహీక గతేడాది క‌రోనా స‌మ‌యంలో హ‌డావిడిగా పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కొన్ని రోజులు పాటు పూజ‌ల‌తో బిజీ అయిన రానా.. ఆ త‌ర్వాత గోవాలో హ‌నీమూన్‌కు వెళ్లొచ్చాడు. తాజాగా ఈ జంట మ‌రోసారి ముంబై స‌హా ప‌లు లొకేష‌న్ల‌కు వెళ్లిన‌ప్ప‌టి ఫోటోలు వైర‌ల్ కాగా.. అక్క‌డి నుంచి తిరిగి వ‌స్తుండ‌గా.. హైద‌రాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌మంలో కెమెరా కంటికి చిక్కారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా అవుతున్నాయి.

ఇదిలా ఉంచితే.. Rana రానా ప్ర‌స్తుత చిత్రం విరాట‌ప‌ర్వం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అనంత‌రం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పాటు మ‌ళ‌యాలంలో విజ‌యంత‌మైన అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ చిత్రం తెలుగులో రీమేక్‌గా వ‌స్తున్న సినిమాలో Rana రానా న‌టిస్తున్నాడు. దీనికి సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ ఈ చిత్రానికి అందిస్తున్నారు.