Pan India Movie: అర‌ణ్య ట్రైల‌ర్‌.. ఈ సినిమా న‌న్ను పూర్తి మ‌నిషిగా మార్చింది: హీరో రానా దగ్గుబాటి

Pan India Movie: రానా దగ్గుబాటి హీరోగా విష్ణు విశాల్‌, శ్రియ పిల్గావోంక‌ర్, జోయా హుస్సేన్‌ ముఖ్య పాత్రదారులుగా ప్రముఖ దర్శకుడు ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన చిత్రం అర‌ణ్య‌. ఈరోస్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మార్చి 26న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మార్చి 3న హైదరాబాద్ పీఆర్‌లో జ‌రిగిన వేడుక‌లో ‘అరణ్య’ ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో రానా, దర్శకుడు ప్రభు సాల్మన్, హీరోయిన్స్ శ్రియ పిల్గావోంక‌ర్, జోయా హుస్సేన్, నటుడు విష్ణు విశాల్, ఈరోస్ ప్రతినిధి నందు ఆహుజా పాల్గొన్నారు.

Rana Movie

Pan India Movie హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్ళ తరువాత ‘అరణ్య’ సినిమా వస్తుంది. ప్రభు సాల్మన్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో అరణ్య క్యారెక్టర్ ప్లే చేశాను.. ప్రభు సాల్మన్ స్టయిల్ లోనే ఈ చిత్రం ఉంటుంది. ‘మనం ఎక్కడి నుంచి వచ్చామో.. అక్కడికి వెళ్లిపోతాం. ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్లలేం’ అనేది అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని నాకు ఏనుగు మరోలా చెప్పింది. ‘ఈ ప్రకృతిలో నువ్వు ఒక భాగం. ఆ భూమిని నువ్వు చూసుకుంటే.. అది నిన్ను మళ్లీ చూసుకుంటుందని. సిటీ, టౌన్ లో పుట్టిపెరిగిన ఓ కుర్రాడు ప్రకృతికి, మనుషులకు జరిగిన పోరాటంలో ఏనుగులను రిప్రజెంట్ చేస్తూ.. వాటిని ఎలా కాపాడాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. ప్రభుతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియెన్స్ నిచ్చింది. ఆయనది ఒక సెపరేట్ స్కూల్. అనుకున్న సీన్ వచ్చేదాకా తను ఎన్ని టేక్ లైనా తీస్తాడు. థియేటర్స్ లో ప్రేక్షకులకు మనం చెప్పే కథ నచ్చకపోతే వెంటనే లేచి వెళ్లిపోతాడు. అందుకని వారికి నచ్చే సీన్స్ చేయాలి అని ప్రభు చెప్తుంటాడు.. ఆయనలో నాకు బాగా నచ్చిన విషయం ఇది. నాకింత మంచి చిత్రం ఇచ్చినందుకు ప్రభుకు థ్యాంక్స్‌. నేను చేసిన ప్రతి సినిమా నుంచీ ఏదోక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను. ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చింది. అడవిలో ఉండటం.. ఏనుగులతో గడపడం వల్ల మనుషులతో నా రిలేషన్‌ మరింత బలపడింది. ఈ సినిమాని Pan India Movieతెలుగు, హిందీ, తమిళ్ మూడు భాషల్లో చేశాం. గతేడాదే చిత్రీకరణ పూర్తయింది. చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ, ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూపించాలన్న ఉద్దేశంతో ఈరోస్ నిర్మాతలు ఏడాది పాటు వెయిట్ చేసి మార్చి 26న వరల్డ్ వైడ్ గా బిగ్ రిలీజ్ చేస్తున్నారు. వాళ్లకి నా స్పెషల్ థ్యాంక్స్‌”.. అన్నారు.

దర్శకుడు ప్రభు సాల్మన్ మాట్లాడుతూ.. “ఏనుగులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ది రెండో స్థానం. కానీ, ఐదేళ్లుగా ఇక్కడ అనేక కారణాల వల్ల ఏడాదికి 700 నుంచి 800 వరకు ఏనుగులు మరణిస్తున్నాయి. దీనికి అడవుల విస్తీర్ణం తగ్గడమూ ఒక కారణం. దీని ఫలితంగానే పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని మనమూ అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. రానా ఇందులో ఏనుగుల గొంతుకగా కనిపిస్తారు. అన్ని రకాల భావోద్వేగాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథా చిత్రమిది.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రెండు గంటల పాటు అందమైన అడవి జీవితాన్ని ఆస్వాదిస్తారు.. ఈ కథ అనుకోగానే నాకు ఫస్ట్ మైండ్లో రానానే గుర్తుకు వచ్చారు. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని స్క్రిప్ట్ రెడి చేశాను. ఎక్కువ భాగం షూటింగ్ థాయిలాండ్ అడవుల్లో షూట్ చేశాం. ఈరోస్ సంస్థ బిగ్ స్కేల్ లో పాన్ ఇండియా చిత్రంగా “అరణ్య” చిత్రాన్ని నిర్మించారు. ప్రేక్షకులందరికీ గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. బ్యూటిఫుల్ విజువల్స్ తో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది” అన్నారు.

నటుడు విష్ణు విశాల్‌ మాట్లాడుతూ.. “అరణ్యలో సింగా అనే పాత్రలో నటించాను.. కథలో ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర నాది. రకరకాల వెరీయేషన్స్ ఉంటాయి. అనేక మలుపులతో నా క్యారెక్టర్ రన్ అవుతుంది. రానా నాకు మంచి స్నేహితుడు.. ఆయనతో వర్క్ చేయడం చాలా ప్రౌడ్ గా ఫీలవుతున్నాను.. ఈ సినిమాలో నేను నటించడానికి మెయిన్ కారణం రానానే. రఘు బాబు నాకు ఎంతో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. ఎన్నో టిప్స్ చెప్పారు. మా కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి. క్లైమాక్స్ హైలెట్ గా ఉంటుంది. ప్రభు సర్ తో వర్క్ చేయడం గొప్ప అనుభూతిని కలిగించింది. ఇంత మంచి సినిమా ద్వారా తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఆడియెన్స్ అందరికీ ‘అరణ్య’ బ్యూటిఫుల్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది” అన్నారు.

శ్రియ పిల్గావోంక‌ర్‌ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో న్యూస్ రిపోర్టర్ గా నటించాను. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది. రానాకు సపోర్ట్ చేస్తూ.. వుండే పాత్ర. ఇంత మంచి బిగ్ పాన్ ఇండియా మూవీలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది” అన్నారు.

జోయా హుస్సేన్ మాట్లాడుతూ.. “నేను హైదరాబాద్ అమ్మాయిని. ఏనుగులను కాపాడే రానా టీంలో ముఖ్య పాత్ర చేశాను. బిగ్ స్పాన్ ఉన్న ఫిల్మ్ ఇది. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అని చెప్పవచ్చు. చాలా ఎక్సయిటింగ్ గా ఉంది” అన్నారు.

ఈరోస్ సంస్థ ప్రతినిధి నందు ఆహుజా మాట్లాడుతూ.. “ప్రభు, రానా కాంబినేషన్లో వస్తోన్న ‘అరణ్య’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 26న అత్యధిక స్క్రీన్స్ లలో రిలీజ్ చేస్తున్నాం. బిగ్ స్కేల్ లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా తెలుగు, హిందీ, తమిళ్ త్రీ లాంగ్వేజెస్ లో నిర్మించాం.. గ్యారెంటీగా ఈ చిత్రం ఆడియెన్స్ కి నచ్చుతుంది” అన్నారు.