సాహో హాట్ బ్యూటీ ప్లేస్ ని శివగామి దేవి రీప్లేస్ చేసిందా?

ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా రొమాంటిక్. కేతిక శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాని పూరి జగన్నాధ్ ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని పూరి శిష్యుడు అనీల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ తో సెగలు పుట్టించిన రొమాంటిక్ సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ రోల్ లో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా జాయిన్ అయిన రమ్యకృష్ణ, సినిమాకి మెయిన్ ఎస్సట్ గా మారుతుంది అనడంలో సందేహం లేదు.

రొమాంటిక్ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తున్న పాత్రలో ఇంతకు ముందు మందిరా బేడీ నటించిందట. ఆమెతో చేసిన సీన్స్ లో ఇంపాక్ట్ లేకపోవడం, మందిరా బేడీ కన్నా తెలుగులో రమ్యకృష్ణ రీచబిలిటీ ఎక్కువ కావడంతో… పూరి రమ్యకృష్ణ సైడ్ షిఫ్ట్ అయ్యాడు. ఎప్పుడో పూర్తవ్వాల్సిన రొమాంటిక్ షూటింగ్ డిలే అవ్వడానికి కారణం కూడా ఇదేనని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి రమ్యకృష్ణ ప్రెజెన్స్ ఆకాష్ పూరికి ఎలాంటి హిట్ ఇస్తుంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.