కేరళలో సైతం రామోజీరావు సేవలు

2018లో కేరళలో సంభవించిన వరదలకు ఆశ్రయం కోల్పోయిన వరద బాధితులకు… 121 ఇళ్లు నిర్మించి ఇచ్చారు రామోజీరావు గారు. అంతకుముందు 2014లో సంభవించిన హుద్ హుద్ తుఫాన్ విలయంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు… శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి లో 64 ఇళ్లు నిర్మించి.. అప్పటి కలెక్టర్ జె.నివాస్ మరియు అప్పటి వైఎస్సార్సీపీ జిల్లా కోర్దినేటర్ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇళ్లకు సంబంధించిన తాళాలు అందించడం జరిగింది !

అంతేకాకుండా… విశాఖ జిల్లా వాడపాలెంలో 80 ఇళ్ళు, పాత మేఘవరంలో 36 ఇళ్ళు, ఉమ్మిలాడ గ్రామంలో 28 ఇళ్ళకు 2016 లో శంఖుస్థాపన చేసి నిర్మాణం చేయడం జరిగింది !! ఇవే కాకుండా గుజరాత్ లోని ఖచ్ లో సంభవించిన భూకంప బాధితులకు, పలురాష్ట్రాల్లో ఈనాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్దాశ్రమాలు, అనాధాశ్రమాల నిర్మాణం లాంటి ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు రామోజీరావు గారు.

కుహానా మేధావితనంతో విమర్శించే ఉండవల్లి లాంటి వాళ్ళకి.. కులవిద్వేషంతో రగిలిపోయే జగన్ రెడ్డి అనుచరులకి ఇలాంటివి ఎంతమాత్రం కనపడవు !! ఉన్నత స్థానాలకు చేరిన వ్యక్తులను చూసి స్ఫూర్తి పొందాల్సింది పోయి… అసూయతో రగిలిపోవడం కొన్ని జాతుల్లో జన్యుపరమైన లోపంగా సరిపెట్టేసుకోవడం తప్పించి ఇంకేమీ చేయలేం !!