రేపు రామోజీరావు అంతిమ యాత్ర

ఈరోజు ఉదయం మీడియా దిగ్గజం, వ్యాపార వేత్త, సినీ నిర్మాత రామోజీరావు కన్నుమూశారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా 88 సంవత్సరాలు వయస్సులో ఆయన ఈరోజు మరణించడం జరిగింది. ఈరోజు ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఉంచగా ఇప్పుడు కేంద్ర కార్యాలయం నుండి నివాసానికి తరలించనున్నారు. రేపు ఉదయం సుమారు 9 గంటల వరకు ఆయన నివాసంలో ఉంచగా ఆ తరువాత అంతిమయాత్ర మొదలు కానున్నారు. రామోజీరావు నివాసం నుండి ఎంసిటీలోని స్మృతి వనం వరకు అంతిమయాత్ర జరగనుంది. ఆ తరువాత స్మృతి వనంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన అంత్యక్రియలకు ఎందరో సినీ, రాజకీయ నేతలు, పత్రిక మీడియా ప్రముఖులు హాజరు కానున్నారు.