Mega Powerstar: ఆచార్య నుంచి నా పోస్ట‌ర్ వ‌స్తుంది: ఫ్యాన్స్‌‌‌తో రాంచ‌ర‌ణ్

Mega Powerstar: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ రేపు జ‌న్మ‌దినం జ‌రుపుకోబోతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి పోస్ట‌ర్‌ను ఇవాళ సాయంత్రం 4గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్నార‌ని విష‌యం తెలిసిందే. అలాగే మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ఆయ‌న‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఆర్ఆర్ఆర్ గెట‌ప్‌లో ఉన్న చ‌ర‌ణ్ మోష‌న్ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో మెగాభిమానులు ఎంతో ఖుష్ అవుతున్నారు. చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే ముందు రోజు నుంచే అభిమానుల్లో పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది.

Ramcharan latest

ఇక తాజాగా Mega Powerstar చ‌ర‌ణ్ అభిమానులు రాంచ‌ర‌ణ్ ఇంటి ద‌గ్గ‌ర కోలాహ‌లం చేశారు.. దీంతో అభిమానుల‌తో కొంత సేపు ముచ్చ‌టించారు చ‌ర‌ణ్‌. ఈ క్ర‌మంలో ఈ రోజు ఆర్ఆర్ఆర్ చిత్రంకు సంబంధించి రామ‌రాజు పోస్ట‌ర్ రిలీజ్ చేస్తారు. అలాగే రేపు ఆచార్య చిత్రం నుంచి సిద్ధ పాత్ర లుక్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేస్తార‌ని Mega Powerstar చర‌ణ్ చెప్ప‌గానే అభిమానుల్లో కేరింత‌లు, చ‌ప్ప‌ట్లు, విజిల్స్‌తో పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపించింది.‌