Gangubai: ఆలియాకు విషెస్ తెలిపిన రాజ‌మౌళి, చ‌ర‌ణ్..

Gangubai: బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియాభ‌ట్ న‌టిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం గంగూభాయి క‌తియావాడి. ఈ చిత్రానికి ప్ర‌ముఖ బాలీవుడ్ డైరెక్ట‌ర్ సంజ‌య్‌లీలా భ‌న్సాలీ డైరెక్ష‌న్ చేస్తున్నాడు. ఇందులో అలియా సెక్స్‌వ‌ర్క‌ర్ పాత్ర‌ను పోషిస్తుండ‌గా.. హుస్సేన్ జైదీ ర‌చించిన మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబై లోని మేడ‌మ్ ఆఫ్ కామ‌తిపుర ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈGangubai సినిమాకు సంబంధించి టీజ‌ర్‌ను నిన్న రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఇందులో సెక్స్‌వ‌ర్క‌ర్ గంగూభాయి పాత్ర‌లో అలియా ఎంతో ఒదిగిపోయారు. దీంతో ఈ టీజ‌ర్‌పై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. తాజాగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఈ టీజ‌ర్ గురించి ట్వీట్ చేశారు.

Gangubaiగంగూభాయి టీజ‌ర్ చాలా బాగుంది సంజ‌య్ స‌ర్‌. ఆలియా తెర‌పై ఎంతో అద్భుతంగా ఉంది.. ఈసినిమా విడుద‌ల కోసం ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నాను అంటూ చ‌ర‌ణ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ చేశాడు. అలాగే రాజ‌మౌళి ట్వీట్ చేస్తూ.. Gangubaiగంగూభాయిగా ఆలియా భ‌ట్ ఎంతో ఒదిగిపోయింది. వెండితెర‌పై సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప‌నిత‌నం చూసేందుకు ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు. కాగా దీనికి Gangubaiఆలియా స్పందిస్తూ.. రాజ‌మౌళి జీ.. చ‌ర‌ణ్‌కు ధ‌న్య‌వాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఇక రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచ‌ర‌ణ్‌కు జోడీగా ఆలియాభ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.