RRR Team: ధైర్య‌వంతుడైన‌ నా సోద‌రుడు రామ‌రాజుకు హ్యాపీ బ‌ర్త్‌డే: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్

RRR Team: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశారు. ఈ క్ర‌మంలో ఆర్ఆర్ఆర్ చిత్ర ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి సెట్స్‌లో రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సెలెబ్రెష‌న్స్ నిర్వ‌హించారు. స్వ‌యంగా రాజ‌మౌళి కేకు తెప్పించి రామ్‌చ‌ర‌ణ్‌కు కేకు తినిపించాడు. అలాగే సెట్స్‌లో కెమెరామెన్ సెంథిల్‌, నిర్మాత డీవీవీ దాన‌య్య‌, జ‌క్క‌న్న కొడుకు కార్తికేయ చర‌ణ్‌తో ఎంతో ఎంజాయ్ చేశారు..

ప్ర‌స్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీంగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కొమురం భీం.. అల్లూరికి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. ధైర్య‌వంతుడు.. నిజాయితీప‌రుడు.. నీతిమంతుడు.. అత‌డే నా సోద‌రుడు రామ్‌చ‌ర‌ణ్ అంటూ తార‌క్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంవ‌త్స‌రం మ‌న‌కు గొప్ప‌గా ఉండ‌బోతుందంటూ ఆశాభావం వ్య‌క్తం చేశారు.‌‌‌