Tollywood: మంచు విష్ణు-కాజ‌ల్‌ చిత్రంపై ఆస‌క్తిక‌ర కామెంట్ చేసిన రాంచ‌ర‌ణ్‌..

Tollywood: మంచు విష్ణు, కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం మోస‌గాళ్లు.. ఈ చిత్రం నిన్న రిలీజ్ అయి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. విష్ణు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో.. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు..

Mosagallu movie

మోస‌గాళ్లు చిత్ర‌బృందానికి శుభాకాంక్ష‌లు.. పాజిటివ్ రెస్పాన్స్‌ను నేను కూడా వింటున్నాను. విష్ణు మంచు న‌ట‌న చాలా బాగుంది.. అలాగే కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టికి అభినంద‌న‌లు తెలిపాడు. అలాగే ఈ ఎంగేజింగ్ థ్రిల్ల‌ర్ ను త‌ప్ప‌కుండా చూడాల‌ని ట్వీట్ లో పేర్కొన్నాడు రాంచ‌ర‌ణ్. దీనికి మంచు విష్ణు స్పందిస్తూ.. ఈ రోజు ఉద‌యం కాల్ చేసినందుకు చాలా ఆనందంగా అనిపించింద‌ని.. మై డార్లింగ్‌ బ్ర‌ద‌ర్ .. అంటూ రాంచ‌ర‌ణ్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు.