Ramcharan: ఆచార్య‌లో నాన్న‌తో న‌టించ‌డం నా అదృష్టం: రామ్‌చ‌ర‌ణ్

Ramcharan: మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఆచార్య చిత్రం తెర‌కెక్కుతున్న విషయం అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ సిద్ధ‌గా అల‌రించ‌నున్నాడు.. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కులు ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి తాజాగా విడుద‌లైన ఆచార్య టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రిస్తోంది. ఈ టీజ‌ర్‌పై స్పందించిన మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ మాట్లాడుతూ..

ఆచార్య సినిమాలోRamcharan తానూ భాగం కావ‌డం ప‌ట్ల ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. నాన్న‌తో క‌లిసి స్ర్కీన్ షేర్ చేసుకోవ‌డం ఎంతో అదృష్టం. అలాగే ఈ సినిమాలో నా పాత్ర పేరు సిద్ధ‌.. ఈ పాత్ర‌లో త‌న‌ని అతిథిగా తీసుకున్నార‌నే కానీ.. నా వ‌ర‌కూ ఇది పూర్తి నిడివి ఉన్న పాత్ర అని అన్నారు. నాన్న సినిమాలో న‌టించ‌డానికి అవ‌కాశం ఇచ్చిన నాకు.. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ గారికి ధ‌న్య‌వాదాలు తెలిపారుRamcharan. అదేవిధంగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మాట్లాడుతూ.. అభిమానులు ఎంత ఊహించుకుంటున్నారో అంత‌కంటే ఎక్కువ‌గా.. ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారిని చూపిస్తున్నాను. అలాగే సిద్ధ పాత్ర‌కు Ramcharan రాంచ‌ర‌ణ్ త‌ప్ప వేరే ఎవ‌ర్నీ ఊహించుకోలేక‌పోయాను.. ఈ పాత్ర‌కు ఆయ‌నే స‌రైన న్యాయం చేయ‌గ‌ల‌రు అని పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రాంచ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తుండ‌గా.. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే విల‌న్‌పాత్ర‌లో రియ‌ల్‌హీరో సోనూసూద్ పోషిస్తున్నారు.. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందిస్తున్నారు.