సింగర్ సునీతకు వాలెంటైన్స్ డే సర్‌ప్రైజ్

ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత గత కొద్దిరోజుల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్‌వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొంతమంది సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన సునీత.. తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అయితే త్వరలో వాలెంటైన్స్ డే వస్తుండటంతో.. పెళ్లి తర్వాత వస్తున్న తొలి వాలెంటైన్స్‌డేను ఉల్లాసంగా జరుపుకునేందుకు సునీత-రామ్ ప్లాన్ చేస్తున్నారట.

ram surprise gift to sunitha

ఈ క్రమంలో సునీతకు రామ్ ఒక భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. తన భార్యకు అత్యంత విలువైన ఒక గిఫ్ట్ ఇవ్వాలని రామ్ ప్లాన్ చేస్తున్నారట. కాగా ఇప్పటికే విహార యాత్రకు వెళ్లి వచ్చిన దంపతులు తాజాగా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా మారినట్లు తెలుస్తోంది