క్లాసైనా ఓకే… మాసైనా ఓకే

రీసెంట్ గా సాలిడ్ హిట్ అందుకున్న రామ్ పోతినేని, మరోసారి మాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడా? అంటే ఇండస్ట్రీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ సినిమాలు చేసిన రామ్, ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ తో తన ఆలోచన మార్చుకున్నాడని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్, త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ కన్నా ముందు మాస్ సినిమాలకి కెరాఫ్ అడ్రెస్ గా నిలిచిన వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

వినాయక్ జానర్ లో సాగుతూనే రామ్ కి సరిపోయే కథతో వినాయక్ రెడీగా ఉన్నాడని, త్రినాథ రావు నక్కిన సినిమాని రామ్ కొంచెం పోస్ట్ పోన్ చేస్తే వినాయక్ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇస్మార్ట్ హిట్ అందుకున్న రామ్, అదే బాటలో నడుస్తూ వినాయక్ తో సినిమా చేస్తాడా లేక వేరియేషన్ చూపిస్తూ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో చేస్తాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.