ప్రముఖ జర్నలిస్టుపై RGV సినిమా.. ద న్యూస్ ప్రాస్టిట్యూట్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదం ఎక్కడ పుడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై నేషనల్ మీడియాలో అనేక రకాల డిబేట్స్ నడుస్తున్నాయి. అయితే ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ఇటీవల డిబేట్ లో బాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో వర్మ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు.

అర్నబ్ గోస్వామి తన ఛానెల్ లో నిర్వహించిన డిబేట్ లో బాలీవుడ్ డర్టీ ఇండస్ట్రీ అంటూ సుశాంత్ సింగ్ లాంటి మరణాలు ఎన్నో ఉన్నాయని వాటిపై స్పంధించాల్సిన అవసరం ఇప్పుడు ఉందని సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ వంటి వారిపై విమర్శలు చేశారు. అయితే అర్నబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన వర్మ అయం చెప్పిన మాటలు అవివేకంగా ఉన్నాయని అంటూ దీనిపై బాలీవుడ్ అగ్ర తారలు ఎందుకు సైలెన్స్ గా ఉంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. అలాగే అర్నబ్ గోస్వామి పై సినిమా సినిమా కూడా తీస్తానని అన్నారు. ఇక ఆ సినిమా టైటిల్ ‘అర్నబ్ ద న్యూస్ ప్రాస్టిట్యూట్’ అని వర్మ వివరణ ఇచ్చారు.