
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా అభిమానుల్లో జోష్ పెంచేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాకు బిగ్ హైలైట్. లండన్‌లో తన మైనపు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా రామ్ చరణ్ ‘పెద్ది’ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. “సినిమా 30% షూటింగ్ పూర్తయింది. ఇది ‘రంగస్థలం’ కంటే గొప్పగా ఉంటుంది!” అని ధీమాగా చెప్పారు. ఈ కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. భావోద్వేగాలు, యాక్షన్, రామ్ చరణ్ పవర్‌ఫుల్ రోల్‌తో ‘పెద్ది’ అదరగొట్టనుందని టాక్. ఈ సినిమా ‘రంగస్థలం’ రికార్డులను బద్దలు కొడుతుందా? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది? అనేది హాట్ టాపిక్. మెగా ఫ్యాన్స్ రిలీజ్ కోసం ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు.