గూస్బమ్స్ తెప్పిస్తున్న రామ్ చరణ్ “పెద్ది” ఫస్ట్ షాట్

ఓ సరికొత్త తెలుగు యాసలో డైలాగ్స్ అంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ “పెద్ది” ఫస్ట్ షాట్ విడుదల చేసారు. అదేంటో తెలుసుకోవాలంటే.. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేక‌ర్‌ బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. బలమైన నేపథ్యం, చిత్ర బృందంతో రూపొందుతోన్న పెద్ది చిత్రం భారతీయ సినిమాలో ప్ర‌త్యేక చిత్రంగా సెన్సేష‌న్స్‌కి నాంది ప‌లుకుతోంది. శ్రీ రామ నవమి సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ షాట్ గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేసి సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించ‌టం విశేషం.

పెద్ది ఫ‌స్ట్ షాట్ వీడియోను గ‌మ‌నిస్తే భారీ జ‌న స‌మూహం రామ్ చ‌ర‌ణ్ కోసం ఉత్సాహంగా కేరింత‌లు కొడుతుంటారు. అలాంటి సంద‌ర్భంలో అంద‌రూ వావ్ అంటూ ఆశ్చ‌ర్య‌పోయేలా, ప‌వ‌ర్‌ప్యాక్డ్ ఎంట్రీ ఇచ్చేశారు గ్లోబ‌ల్ స్టార్‌. భుజంపై బ్యాట్‌ను తీసుకొస్తూ, బీడీ తాగుతూ తిరుగులేని ఆత్మ‌విశ్వాసంతో హీరో క్రికెట్ మైదానంలోకి అడుగు పెడ‌తాడు. ఆ ఎంట్రీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇక చ‌ర‌ణ్ డిఫ‌రెంట్ యాస‌తో చెప్పిన డైలాగ్ డెలివ‌రీ స‌న్నివేశాన్ని నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. చ‌ర‌ణ్ చెప్పిన ఆ సింగిల్ డైలాగ్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా, ప్ర‌భావ‌వంతంగా, జీవ‌న దృక్ప‌థాన్ని, పాత్ర సారాంశాన్ని సంపూర్ణంగా ప్ర‌తిబింబించేలా ఉంది.

ఫ‌స్ట్ షాట్‌లోని మిగ‌తా యాక్ష‌న్ స‌న్నివేశాల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి.. చ‌ర‌ణ్ పొలాల్లో ప‌రిగెత్త‌తూ వెళ్లి, గోని సంచిని చించి చేతికి చుట్టుకుంటూ, చివ‌ర‌గా క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టటం.. అలాగే క్రికెట్ క్రీజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బ్యాట్ హ్యాండిల్‌ను నేల‌పై కొట్టి, బంతిని బ‌లంగా బాదితే అది బౌండ‌రీని దాటే సీన్ గూజ్ బంప్స్‌ను తెప్పిస్తుంది. సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా? అనే ఆశ‌ను ఇంకా పెంచేలా ఈ స‌న్నివేశం ఉంది.

రామ్ చ‌ర‌ణ్ ర‌గ్డ్ లుక్‌, పొడ‌వాటి జుట్టు, గుబురు డ‌డ్డం, ముక్కుకి ధ‌రించిన రింగు ఇవ‌న్నీ త‌న క్యారెక్ట‌ర్‌లోని రానెస్‌, పాత్ర‌లోని ఇన్‌టెన్సిటీని తెలియ‌జేస్తున్నాయి. త‌న డైలాగ్ డెలివ‌రీలోని ప‌దును, దాన్ని ఆయ‌న డిక్ష‌న్‌తో ప‌లికిన తీరు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తున్నాయి. విజ‌య‌న‌గ‌రం యాసతో రామ్ చ‌ర‌ణ్ డైలాగ్ చెప్పిన విధానం చూడ ముచ్చ‌ట‌గా ఉంది. ఇది ఆయ‌న పాత్ర‌ను మ‌రింత ప్రామాణికంగా, శ‌క్తివంతంగా చూపిస్తోంది. అలాగే జీవితంలో సాధించాల‌నుకున్న‌ప్పుడు ఎలా ఉండాల‌నే దాన్ని డైలాగ్ రూపంలో చెప్పిన తీరు జీవ‌న త‌త్వాన్ని తెలియ‌జేస్తోంది. రామ్ చ‌ర‌ణ్ త‌న‌దైన న‌ట‌న‌తో పెద్ది పాత్ర‌ను అత్య‌ద్భుతంగా, తిరుగులేని విధంగా ఆవిష్క‌రిస్తున్నార‌ని చెప్పొచ్చు.

డైరెక్ట‌ర్ బుచ్చిబాబుని ఈ సంద‌ర్భంలో ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేం. జీవితంలో మ‌న‌కు క‌నిపించే పాత్ర‌ను అసాధార‌ణ రీతిలో జీవం పోశారు. ప్ర‌తి స‌న్నివేశం, ప్ర‌తి క్ష‌ణం ఒక క‌చ్చిత‌త్వాన్ని సూచిస్తుంది. సాంకేక‌తంగానూ, నిర్మాణ పరంగానూ ప్ర‌తీ ఫ్రేమ్‌ అద్భుతంగా క‌నిపిస్తోంది. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్‌.ర‌త్న‌వేల్ ఒక్కో స‌న్నివేశాన్ని త‌న కెమెరాలో పిక్చ‌రైజేష‌న్ తీరు అద్భుతం. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ అందించిన నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌ను మ‌రింత గొప్ప‌గా, శ‌క్తివంతంగా ఆవిష్క‌రిస్తున్నాయి. గ్రామీణ నేప‌థ్యం కోసం వేసిన సెట్స్ చూస్తుంటే నిర్మాణ ప‌రంగా ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌కుండా అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో జీవం పోసేలా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ అవినాష్ కొల్ల ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ వ‌ర్క్ పెద్ది ప్ర‌పంచంలోకి అంద‌రినీ లీన‌మ‌య్యేలా చేస్తుంది. ఓ కొత్త అనుభూతినిస్తోంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ ఎడిట‌ర్ న‌వీన్ నూలి చెప్పాల‌నుకున్న విష‌యాన్ని ఆక‌ర్ష‌ణీయంగా, గ్రిప్పింగ్‌గా మ‌లిచిన‌ట్లు క‌నిపిస్తుంది.

PEDDI – HD – FILES https://drive.google.com/drive/folders/148gR1X-qImXUVOT8O7jSYq0g5_QUgEdZ?usp=sharing

రామ్ చ‌ర‌ణ్ అద్భుత‌మైన, మాస్ అప్పీల్‌తో కూడిన పెర్ఫామెన్స్‌.. బుచ్చిబాబు చ‌క్క‌టి రైటింగ్, టేకింగ్‌.. అద్భుత‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌తో కూడిన టీమ్ ఉన్న పెద్ది సినిమా ఉన్న‌త స్థాయి ప్ర‌మాణాల‌తో రూపొందుతోంది. తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ షాట్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచింది. ఈ చిత్రాన్నివ‌చ్చే ఏడాది రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మార్చి 27, 2026లో వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు అస‌మాన‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది.

న‌టీన‌టులు:

రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్‌, శివ రాజ్‌కుమార్‌, జ‌గ‌ప‌తిబాబు, దివ్యేందు శ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
స‌మ‌ర్ప‌ణ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌
బ్యాన‌ర్ : వృద్ధి సినిమాస్‌
నిర్మాత‌: వెంట‌క స‌తీష్ కిలారు
మ్యూజిక్‌: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.ర‌త్న‌వేలు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: అవినాష్ కొల్ల‌
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వి.వై.ప్ర‌వీణ్ కుమార్‌