‘గేమ్ ఛేంజర్’ టీం నుండి రామోజీ రావు గారికి అశ్రు నివాళ్లు

పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్… రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకులు శంకర్, నటులు సునీల్ రఘు కారుమంచి ఇతర చిత్ర బృంద సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రామోజీరావు గారి మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని తెలిపారు. నిన్న గేమ్ చంగెర్ షూటింగ్ కోసం రాజముండ్రి చేరుకున్న రామ్ చరణ్ రామోజీ రావు గారి మరణం విని షాక్ అయ్యారు. అయితే రామాంజి రావు మృత దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన ఇంటికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం.