ప్రభాస్ కథని ప్రొడ్యూస్ చేయనున్న రామ్ చరణ్…

సైరా తర్వాత సురేందర్ రెడ్డి, సాహూ తర్వాత ప్రభాస్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించాయి. జేమ్స్ బాండ్ రేంజ్ కథతో ఈ మూవీ రానుందని కూడా అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మెగా హీరో చేతికి వెళ్లిందని సమాచారం. సురేందర్ చెప్పిన లైన్ నచ్చినా కూడా ప్రభాస్ మూవీ స్టార్ట్ చేయడానికి మరో ఏడాది టైం పట్టే అవకాశం ఉండడంతో, ఇదే కథతో వరుణ్ తేజ్ తో మూవీ చేస్తే బాగుంటుందని డైరెక్టర్ భావిస్తున్నాడట.

దృవ, సైరా సినిమాలు వరుసగా మెగా ఫ్యామిలీ లోనే సినిమాలు చేసిన సురేందర్ రెడ్డి, చరణ్ ఇచ్చిన సలహా మేరకే ఈ ప్రాజెక్ట్ ని వరుణ్ తేజ్ తో ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అయితే ప్రభాస్‌ కోసం సిద్ధం చేసిన కథలో వరుణ్ తేజ్ ఎంతవరకూ సింక్ అవుతాడు. మార్కెట్ సెట్ అవుతుంది, బడ్జట్ కటింగ్స్ వస్తే కథకి న్యాయం జరుగుతుందా అనే విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ పై కానీ గీత ఆర్ట్స్ కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.