అకిరా కోసం రంగంలోకి రామ్ చరణ్.. నిజమేనా?

రీసెంట్ గా అకిరాకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. యువ హీరో అడివి శేష్ తో కలిసి స్టిల్ ఇచ్చిన అకిరా నందన్ పవర్ స్టార్ అభిమానులకు బాగానే ఎట్రాక్ట్ చేశాడు. మెయిన్ గా అకిరా హైట్ అభిమానులబు ఎక్కువగా ఆకట్టుకుంది. దాదాపు అతను హైట్ లో వరుణ్ తేజ్ ని మించి పోయాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో అతనికి సంబంధించిన ఒక రూమర్ వైరల్ గా మారింది. త్వరలోనే అకిరా టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని టాక్ వస్తోంది.

అకిరా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లు రూమర్స్ వస్తున్నాయి. పైగా కొణిదెల ప్రొడక్షన్ లోనే అకిరా ఎంట్రీ ఉండాలని మెగాస్టార్ చెప్పారట. దీంతో చరణ్ అతని కెరీర్ కోసం స్పెషల్ గా కథలను సెర్చ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆ విషయం ఎంతవరకు నిజమో తెలియదు గాని అకిరా నందన్ ఎంట్రీపై గతంలో చాలా సార్లు రేణూ దేశాయ్ ఒక వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అకిరాకు అలాంటి ఆలోచన ఏ మాత్రం లేదని ఇంకా అతని వయసు 16 అంటూ.. పూర్తిగా తన ఎడ్యుకేషన్ పైనే అకిరా దృష్టి పెట్టినట్లు ఆమె వివరణ ఇచ్చారు. ఇక అప్పుడప్పుడు అకిరా హలోడేస్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి ఉంటున్నాడు. తల్లితోనే ఉంటున్న అకోరా మరోవైపు తండ్రి ప్రేమను కూడా ఏ మాత్రం మిస్ చేసుకోవడం లేదు. మరి ఈ వారసుడు వెండితెరపై ఎప్పుడు దర్శనమిస్తాడో చూడాలి.