రాంచరణ్‌కు కరోనా.. పరుగులు తీసిన మెగా ఫ్యామిలీ

టాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రాంచరణ్ స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించాడు. గత కొద్దిరోజుల్లో తనను కలిసిన వారందరూ కరోనా టెస్టు చేయించుకోవాలని రాంచరణ్ కోరాడు. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తానని, తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటానని చెప్పాడు.

ram charan

టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలినా.. తనకు కరోనా లక్షణాలు అసలు లేవని రాంచరణ్ తెలిపాడు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నానని, త్వరలో మరింత స్ట్రాంగ్‌గా బయటికి వస్తానని అన్నాడు. రాంచరణ్‌కు కరోనా సోకిందనే వార్తతో మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా చరణ్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్‌కు మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది.

అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నిహారికతో పాటు మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఫంక్షన్‌లో పాల్గొనవారంతా ఇప్పుడు కరోనా టెస్టు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే నాగబాబుకు కరోనా సోకగా.. ఆయన కొద్దిరోజులకే కోలుకున్నారు. ఇక తనకు కరోనా సోకినట్లు చిరంజీవి ట్వీట్ చేయగా.. ఆ తర్వాత కిట్ లోపం కారణంగా తప్పుడు రిపోర్ట్ వచ్చిందని తేలింది.