
ప్రముఖ తెలుగు టీవీ షోస్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా దీపికా పిల్లి హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈనెల 11వ రోజున ఈ చిత్రం ముందుకు రానున్న సందర్భంగా చిత్రానికి సంబంధించిన మొదటి టికెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మూవీ టీం ఈ సంఘటనకు సంబంధించి ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో రాంచరణ్ కమెడియన్స్ సత్యాను ఆట పట్టిస్తూ తలను గుర్తుపట్టణ విధంగా నటిస్తాను. అలా సరదాగా సాగిన ఆ సందర్భం చివరిలో కమెడియన్ సత్య రామ్ చరణ్ కాళ్ళ మీద పడడానికి ప్రయత్నించగా తిరిగి రాంచరణ్ కూడా కమెడియన్ సత్య కాళ్ళ మీద పడుతున్నట్లు ముందుకి బెండవగా సత్య షాక్ అవుతాడు. అలా ఎంతో సరదాగా ఉంటుంది రామ్ చరణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టికెట్ కొంటున్న వీడియో.