తారక్‌ది కన్ఫార్మ్.. మరి చెర్రీ ఎవరితోనే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. లాక్‌డౌన్ వల్ల ఆలస్యమైన సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ మరో సినిమా చేస్తున్నాడు.

NTR AND RAM CHARAN

గతంలో తారక్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. వారిద్దరు కలిసి చేస్తున్న ఈ రెండో సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే RRR తర్వాత రాంచరణ్ ఎవరితోనే సినిమా చేస్తాడనేది ఇంకా కన్ఫామ్ అవ్వలేదు. ప్రస్తుతం RRRతో పాటు ఆచార్య సినిమాలో కీలక పాత్రలో చెర్రీ నటిస్తున్నాడు.

ఇవి పూర్తైన తర్వాత వంశీ పైడిపల్లి లేదా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చారణ్ సినిమా చేసే అవకాశాలున్నాయి. మరి చరణ్ ఎవరితో సినిమా చస్తాడనేది చూడాలి.