డ్రైవింగ్ చేస్తూ చరణ్ వీడియో, రామోజీ ఫిల్మ్ సిటీ కోర్ట్ లో రామరాజు

జక్కన్న, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో వస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. భారీ బడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ షూట్ కి జాయిన్ అవుతూ చరణ్ ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో స్పెషల్ మెసేజ్ పోస్ట్ పెట్టాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయడం చాలా స్పెషల్ గా ఉంటుందని, ఎర్లీ మార్నింగ్ షూట్స్ అంటే తనకి చాలా ఇష్టమని రామ్ చరణ్ వీడియోలో చెప్పాడు. అయితే ఈ వీడియో చూసిన వాళ్లు చరణ్ ఇలా డ్రైవ్ చేస్తూ వీడియో చేయడంపై కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ సేఫ్ గా ఉండాలని, ఇలాంటి రిస్కులు మంచి కాదని సలహాలు కూడా ఇస్తున్నారు.

టెంపర్ సినిమా నుంచి తన ప్రతి మూవీలో ఎన్టీఆర్, రోడ్ ప్రయాణాలు చేసే అప్పుడు జాగ్రత్త అంటూ ఒక మెసేజ్ ఇస్తాడు. అది చరణ్ పట్టించుకోలేదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన వీడియో చూసి ఇంకొకరికి రాంగ్ ఫీడ్ బ్యాక్ అవ్వకూడదూ అనుకున్నాడో లేక ఎన్టీఆర్ మాటలు పట్టించుకున్నాడో ఏమో కానీ చరణ్ మాత్రం వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే డిలీట్ కూడా చేసినట్లు ఉన్నాడు. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ షూట్ లో, ప్రస్తుతం అల్లూరి సీతారామ రాజును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో విచారించే సన్నివేశాలను ప్రత్యేకమైన సెట్ లో తెరకెక్కిస్తున్నారు. కోర్టులో అల్లూరి సీతారామరాజుగా చరణ్ చెప్పే డైలాగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయట.