ఈ జక్కన్న ప్లాన్ కి అందరూ ఫిదా అవ్వాల్సిందే…

స్మాల్ స్క్రీన్ మీద ఎంటర్‌టైన్మెంట్ క్రియేట్ చేయడానికి, మరోసారి బుల్లితెర రికార్డులు బ్రేక్ చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిద్దమయ్యాడు. ఎందరో మహానుభావులు, మీ అందరికీ మీ ఎన్టీఆర్ అంటూ ప్రేక్షకులని మాటీవీ నుంచి బిగ్ బాస్ షోతో పలకరించిన ఎన్టీఆర్… ఈసారి నేను మీ నందమూరి తారక రామారావు, మిమ్మల్ని గెలిపిస్తానంటూ జెమినీ ఆడియన్స్ ని అలరించడానికి వస్తున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ టెలికాస్ట్ కానున్న ఈ ప్రోగ్రామ్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ప్రోమోతో ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ టీమ్, త్వరలో ప్రసారం కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ ని స్టార్ట్ చేశారు. హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రెడీ అయ్యాడు. ఫస్ట్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ కి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రానున్నాడు. ఎన్టీఆర్ షోకి ఇంత కన్నా గ్రాండ్ డెబ్యు దొరకదేమో. అయితే అక్టోబర్ లో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ఉండడంతో చరణ్ ఎన్టీఆర్ లని ఒకే షోలో బుల్లితెర అభిమానులకి దెగ్గర చేయడం అనేది రాజమౌళి ఆలోచన. సినిమాని ఎంత బాగా తెరకేక్కిస్తాడో అంతే బాగా మార్కెటింగ్ చేయడంలో దిట్ట అయిన జక్కన్న, మరోసారి అలాంటి ప్లానే వేసి తారక్ ముందు చరణ్ ని హాట్ సీట్ లో కుర్చోపెడుతున్నాడు. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుంది.