టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కి కరోనా

టాలీవు్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ‘నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారందరూ వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలో కోలుకుని తిరిగి వస్తాను. త్వరలో షూటింగ్‌లలో పాల్గొంటాను. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని రకుల్ ట్విట్టర్‌లో పేర్కొంది.

rakul preeth singh

దీంతో రకుల్ వెంటనే కోలుకుని తిరిగి రావాలంటూ ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ‘గెట్ వెల్ సూన్’ అంటూ ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల పలు షూటింగ్స్‌లలో రకుల్ పాల్గొంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో వైష్ణవ్ తేజ్‌ హీరోగా వస్తున్న సినిమాలో నటించింది. దీంతో పాటు నితిన్, చంద్రశేఖర్ ఏలేటి కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్‌లో కూడా ఇటీవల పాల్గొంది. ఈ క్రమంలో రకుల్ కరోనా బారిప పడటంతో ఆ రెండు సినిమాల యూనిట్ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పుడు రకుల్‌కి కరోనా అని తేలడంతో.. ఆ రెండు సినిమాల షూటింగ్స్‌లలో పాల్గొన్న యూనిట్ సభ్యులు కూడా క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కొద్దికాలం పాటు ఆమె నటిస్తున్న సినిమా షూటింగ్‌లను ఆపివేసే అవకాశముంది.