తెలుగులో అవకాశాలు రావన్నారు.. రకుల్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఎవరంటే.. రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెబుతారు. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీ.. ఇక్కడే ఇళ్లు కొనుగోలు చేసి హైదరాబాద్‌లోనే సెటిల్ అయిపోయింది. ఇక తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాలతో పాటు ఇటీవల బాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా ఈ అమ్మడు అవకాశం కొట్టేసింది.

rakul about slim trols

బాలీవుడ్‌లో ప్రస్తుతం నటిస్తున్న దేదే ప్యార్ దే సినిమా కోసం రకుల్ ఏకంగా 8 కేజీల బరువు తగ్గింది. దీనిపై సోషల్ మీడియాలో రకుల్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి. ఇలా ఉంటే తెలుగు సినిమాల్లో అవకాశాలు రావని చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై రకుల్ స్పందించింది. ‘నేను కళ్ళు మూసుకొని మనసుకి ఒకటే చెప్పుకున్నా.. ఏదీ పట్టించుకోను.. నా పనే నాపై వస్తున్న విమర్శలకు సమాధానం చెబుతుందని నన్ను నేను సముదాయించుకున్నా’ అని రకుల్ తెలిపింది.