తమన్నా కనిపించలేదు కానీ విపించింది…

తెలుగు సినిమాలో సక్సస్ఫుల్ సిరీస్ గా పేరు తెచ్చుకున్న సినిమా రాజు గారి గది. ఓంకార్ తెరకెక్కించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడో సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అశ్విన్ బాబు, అవికా ఘోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా ముఖ్య పాత్ర పోషించింది. దసరాకి ప్రేక్షకుల ముందుకి రానున్న రాజు గారి గది 3 సినిమా ప్రొమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

రాజు గారి గది 3 ట్రైలర్ లో చూపించిన విజువల్స్, లైటింగ్ ప్యాట్రన్ ఆకట్టుకుంది. చోట కే నాయుడు తన కెమెరా పనితనం మరోసారి ప్రూవ్ చేశాడు, సినిమా సినిమాకి రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న ఓంకార్ మరోసారి రాజు గారి గది 3 ట్రైలర్ తో మెప్పించాడు. అవికా ఘోర్ చాలా గ్లామర్ గా కనిపించింది, అశ్విన్ కామెడీని దాటి యాక్షన్ బాట పట్టినట్లు ఉన్నాడు. ట్రైలర్ లో చూపించిన చివరి సీన్ రాఘవ లారెన్స్ కాంచన సినిమాలని తలపిస్తోంది. ఇక రాజుగారి గది 3 సినిమా ట్రైలర్ లో తమన్నా కనిపించలేదు కానీ వినిపించింది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఇదే యక్షిణి పాతేసిన చోటు అనే డైలాగ్ వచ్చింది, అవికాని రివీల్ చేశారు కాబట్టి ఆ సీన్ తమన్నా గురించే అయి ఉంటుంది. పైగా అశ్విన్, అవికాని కాపాడే సీన్ లో దయ్యం వచ్చినట్లు బిహేవ్ చేశాడు. ఈ సందర్భంలో కాలి గజ్జల సౌండ్ వినిపిస్తుంది. ఈ సీన్ చూస్తే అశ్విన్ కి తమన్నా దయ్యం పట్టినట్లు ఉందనిపిస్తోంది. మరి ఈ లెక్కలు నిజమో కాదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి. ఇదిలా ఉంటే రాజు గారి గది 3 ట్రైలర్ చూసిన వాళ్లు మాత్రం, ఆ రాజుకి ఇంకెన్ని గదులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా సినిమా సినిమాకి రాజు గారి గది సిరీస్ లో వచ్చే చిత్రాల స్థాయి మాత్రం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా పార్ట్ 3, ముందు వచ్చిన రెండు చిత్రాల కన్నా భారీ స్కేల్ లోనే తెరకెక్కిందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది. ఓంకార్ ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ, మంచి కథలతో చిత్రాలు చేస్తే మాత్రం కోలీవుడ్ కి కాంచన సిరీస్ ఉన్నట్లే, మనకి రాజుగారి గది సిరీస్ ఉందని చెప్పుకునే స్థాయికి ఈ సిరీస్ వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.