Ariyana: ఆ యంగ్ హీరోతో బిగ్‌బాస్ బోల్డ్ బ్యూటీ రొమాన్స్!

Ariyana: బిగ్‌బాస్‌-4 సీజ‌న్‌లో పాల్గొన్న టాప్‌-5లో నిలిచి గ్రాండ్ ఫినాలే వ‌ర‌కు కొనసాగింది అరియానా. టాప్‌-5 వ‌ర‌కు వ‌చ్చిన అరియానా నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయిన విష‌యం తెలిసిందే. కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా.. బోల్డ్‌గా ఉంటూ.. బ‌య‌ట ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు Ariyana అరియానా. ఈ నేప‌థ్యంలోనే అరియానాకు ప‌లు ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీకి ఓ చిత్రంలో అవ‌కాశం వ‌చ్చింద‌ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది.

raj tharun-ariyana

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ తాజా చిత్రంను సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు ఫేమ్ ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి తెర‌కెక్కించ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా దీనిపై అరియానా తెలుపుతూ.. బిగ్‌బాస్ త‌ర్వాత Ariyana నా జీవితంలో ఓ మంచి రోజు. అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి గారికి థ్యాంక్స్‌. రాజ్ త‌రుణ్ నువ్వు అమేజింగ్ అని వీరు ముగ్గురు క‌లిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసిందిAriyana. దీంతో పాటు అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌ని హ్యాష్ ట్యాగ్ చేసింది. దీంతో అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌పై రాజ్‌త‌రుణ్‌తో అరియానా న‌టిస్తున్న‌ట్లు ఈ ఫోటో చూస్తే తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇంకా విష‌యాలు తెలియాల్సి ఉంది.