Tollywood: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ‘పవర్ ప్లే’ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది: రాజ్ తరుణ్

Tollywood: యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘పవర్ ప్లే’. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 5న విడుదలవుతున్న ఈ సినిమా గురించి హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ .. నేను కానీ, మా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండాగారు, సినిమాటోగ్రాఫర్ అండ్రూగారు ట్రై చేయని కొత్త జోనర్లో చేసిన థ్రిల్లర్ మూవీనే ‘పవర్ ప్లే’. లాక్డౌన్ తర్వాత మేం కలిసి చాలా రోజులైంది కదా, అని కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు.. కలిసి సినిమా చేద్దామనైదే ఉంది కానీ. ఎలాంటి సినిమా చేయాల‌ని మాట్లాడుకున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌కు డిఫ‌రెంట్‌గా ఉండాల‌ని అనుకున్న‌ప్పుడు నాలుగైదు ఐడియాలు వ‌చ్చాయి.

rajtharun

అందులో ఓ ఆలోచ‌నను మా రైట‌ర్ నంధ్యాల ర‌విగారు, Tollywood డైరెక్ట‌ర్ విజ‌య్ కుమార్‌గారు డెవ‌ల‌ప్ చేస్తే ‘పవర్ ప్లే’ సినిమా క‌థ‌ త‌యారైంది. సినిమాను కొత్త జోన‌ర్‌లో చేయ‌డానికి, స‌క్సెస్‌, ఫెయిల్యూర్‌కి సంబంధం లేదు. ఎందుకంటే ప్ర‌తి సినిమాను స‌క్సెస్ కావాల‌నే ఉద్దేశంతోనే చేస్తాం. ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతుంది, కాక‌పోవ‌చ్చు. అయితే చేసిన త‌ప్పుల‌ను మ‌ళ్లీ రిపీట్ చేయ‌కుండా చూసుకోవాలంతే. ఒరేయ్ బుజ్జిగా రిలీజ్ అనుకున్న‌ప్పుడు కోవిడ్ ప్ర‌భావం స్టార్ట్ కావ‌డంతో సినిమా విడుద‌ల ఆగింది. లాక్‌డౌన్ వ‌చ్చింది. లాక్‌డౌన్ త‌ర్వాత అంద‌రూ క‌లుసుకున్న‌ప్పుడు అంద‌రం క‌లిసి ఈ సినిమాను ప్లాన్ చేశాం. ఇందులో నాది అమాయ‌కుడైన యువ‌కుడి పాత్ర‌. అలాంటి ఓ యువ‌కుడు అనుకోండా అధికారంలోని వ్య‌క్తులు వేసిన ఎత్తుగ‌డ కార‌ణంగా స‌మ‌స్య‌ల్లో ఇరుక్కుంటాడు. ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి త‌ప్పించుకుని తిరుగుతూ త‌న స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మైన వారిని బ‌య‌ట‌కు లాగుతాడు. అదే మెయిన్ క‌థ‌. ప‌వ‌ర్ ప్లే అనేది క్రికెట్ ప‌దం. అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది, క‌థ‌ను స‌రిపోతుంద‌నిపించి పెట్టాం. ‘పవర్ ప్లే’ షూటింగ్ స‌మ‌యంలో ఎంజాయ్ చేస్తూ చేశాం. సెట్స్‌లో సీరియ‌స్‌గా ఉండ‌లేదు. అయితే Tollywood సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. క‌థ‌ను ఫాలో అయిపోయాం. సినిమా మ‌ధ్య‌లో కామెడీ స‌న్నివేశాల‌ను ఇరికించ‌డం వంటివి చేయ‌లేదు. కంఫ‌ర్ట్ లెవ‌ల్స్ బావుంద‌నిపించింది అందుక‌నే విజ‌య్ కుమార్‌గారితో కంటిన్యూ సినిమాలు చేశాను. నెక్ట్స్ విరించితో కూడా సినిమా చేయ‌బోతున్నాను. సినిమా బావుంటే చాలు.. ప్రేక్ష‌కులు సినిమాను ఓటీటీలో అయినా, థియేట‌ర్‌లో అయినా చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు. అయితే థియేట‌ర్‌లో సినిమా చూస్తే ఆ ఎఫెక్ట్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. హీరోయిన్ హేమల్ త‌న పాత్ర‌కు చ‌క్క‌గా సూట్ అయ్యింది. అలాగే పూర్ణ‌గారిని ఇంత వ‌ర‌కూ చూడ‌ని ఒక ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో చూడ‌బోతున్నారు. Tollywood థ్రిల్ల‌ర్ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ బ్యాక్‌బోన్‌లా నిల‌బెడుతుంది. ‘పవర్ ప్లే’ విషయానికి వస్తే.. సురేష్ బొబ్బిలి త‌న బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాడు. వ‌న‌మాలి క్రియేష‌న్స్ లో ఫ‌స్ట్ మూవీ అయినా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ కి త‌ప్ప‌కుండా మంచి పేరు వ‌స్తుంది. ప్రతి సినిమాను చేసేట‌ప్పుడు హండ్రెడ్ ప‌ర్సెంట్ మ‌న‌సు పెట్టి చేస్తాను. సినిమా పూర్తి కాగానే డిస్ క‌నెక్ట్ అవుతాను. ఎందుకంటే సినిమా చేసిన త‌ర్వాత ఫలితం మ‌న చేతిలో ఉండ‌దు క‌దా. శ్రీనివాస్ గవిరెడ్డితో నెక్ట్స్ మూవీ దాదాపు పూర్తయ్యింది. కాస్త ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. విరించి వర్మ సినిమా అరవై శాతం పూర్తయ్యింది. శాంటో అనే డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తాను. విజయ్ కుమార్ కొండాతో మరో సినిమా చేస్తున్నాను. డ్రీమ్ గర్ల్ రీమేక్‌నే విజయ్ కుమార్‌గారి దర్శకత్వంలో Tollywoodసురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో చేస్తున్నాను.