రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జి’గా ఓటీటీ డేట్ ఫిక్స్..

రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓరేయ్ బుజ్జిగా నేరుగా ఆహా ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో చిత్ర యూనిట్ థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ఆశపడింది. కానీ చిత్ర యూనిట్ ఎంత ఎదురుచూస్తున్నప్పటికీ ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ కావని క్లారిటీ వచ్చేసింది.

ఇక ఫైనల్ గా ఈ చిత్రాన్ని OTT లో విడుదల చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. తాజా సమాచారం ప్రకారం, ఒరేయ్ బుజ్జిగా డిజిటల్ ప్రీమియర్‌కి సిద్ధమైనట్లు టాక్. అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా ఆహా యాప్ లో సినిమా ప్రసారం కానుంది. ఈ చిత్రానికి గుండేజారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కెకె రాధమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.