స్టార్ స్టేటస్, కోట్ల ఆస్థి… అయినా సాదు జీవితమే సంతోషం

ఎవరైనా హీరో లేదా హీరోయిన్ షెడ్యూల్ గ్యాప్ వచ్చినా, ఒక సినిమా అయిపోయి ఇంకో సినిమా మొదలు పెట్టే ముందు అయినా… కాస్త గ్యాప్ తీసుకోని ఫారిన్ ట్రిప్ వేస్తూ ఉంటారు. అయితే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం హిమాయలకు వెళ్లిపోతూ ఉంటారు. సినిమా సినిమాకి మధ్య ఉండే గ్యాప్ లో హిమాలయాలకు వెళ్లి, తన స్టార్ స్టేటస్ కి పూర్తి దూరంగా ఉండి సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. ఇప్పటి వరకూ ఎన్నోసార్లు అలా హిమాలయాలకు వెళ్లిన రజినీ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దర్బార్. మురుగదాస్ దస్రహకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రజినీకాంత్, ఇప్పుడు హిమాలయాలకు వెళ్లిపోయాడు.

rajinikanth to himalayas

ఆదివారం ఉదయం విమానంలో డెహ్రాడూన్‌కు బయల్దేరి వెళ్లిన రజినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దర్బార్‌ షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ముంబై నుంచి చెన్నై వచ్చిన రజినీకాంత్ కొన్నిరోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకున్నాడు. కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌ క్షేత్రాలను సందర్శించిన తర్వాత ఆయన హిమాలయాల్లో ఉన్న బాబాజీ గుహలో ధ్యానం చేయనున్నాడు. హిమాలయాల నుంచి తిరిగి వచ్చాక రజినీకాంత్, సన్ పిక్చర్స్ బ్యానర్ లో సిరుత్తై శివతో ఒక సినిమాని చేయనున్నాడు. నాలుగున్నర దశాబాల స్టార్ స్టేటస్, 6కోట్ల 79లక్షల మంది ప్రజల రియల్ లైఫ్ హీరో, కనిపిస్తే చాలు కోట్లు కుమ్మరించే అభిమానులు… ఇవేమి సంతోషం ఇవ్వని మాములు మనిషి రజినీకాంత్. ఇక్కడ రజినీకాంత్ గా, తలైవాగా ఒక వెలుగు వెలుగుతున్న రజిని, హిమాలయాలకు మాత్రం తన గతం మర్చిపోకుండా శివాజీ రావు గైక్వాడ్ గానే వెళ్తాడు. ఎందుకంటే అదే అతనికి ప్రశాంతతని ఇస్తుంది.