రజినీ ది రియల్ లైఫ్ హీరో

సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా దర్బార్ సినిమాకి సంబంధించిన తన షూట్ ని కంప్లీట్ చేశాడు. ఇక తన నెక్స్ట్ సినిమా పనులు మొదలుపెట్టిన రజినీ, శివ దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. తెలుగు విక్రమార్కుడు సినిమాని తమిళంలో కార్తీతో సిరుత్తై సినిమా చేసి హిట్ కొట్టిన శివ, అప్పటి నుంచి సిరుత్తై శివగా మారి కేవలం తల అజిత్ తోనే వర్క్ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ అజిత్ తో నాలుగు సినిమాలు చేసిన శివ ఒకదాన్ని మించి మరొక హిట్ ఇచ్చాడు. 2019 సంక్రాంతికి ఏకంగా రజినీ పేటకే పోటీగా విశ్వాసం సినిమాని రిలీజ్ చేసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. కమర్షియల్ సినిమాలని సూపర్ గా చేసే శివ, హీరోయిజం ఎలివేట్ చేయడంలో దిట్ట. అలాంటిది శివకి హీరోయిజంకి కేరాఫ్ అడ్రెస్ లాంటి రజినీకాంత్ తోడైతే బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయి అనడంలో సందేహం లేదు. రజినీకాంత్-శివ సినిమాల గురించి కాంబినేషన్ గురించి అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

rajinikanth the real life hero

ఇదిలా ఉంటే రజినీని ఆన్ స్క్రీన్ మాత్రమే ఆఫ్ స్క్రీన్ కూడా హీరో అంటారు. అందుకు మరో ఉదాహరణ కూడా ఇప్పుడు తమిళనాడులో చక్కర్లు కొడుతోంది, 41 ఏళ్లక్రితం ఒక సాధారణ బస్ కండక్టర్ శివాజీ రావ్ కి హీరోగా మార్చి 1978లో భైరవి ద్వారా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత కలై జ్ఞానం. ఇన్నేళ్లు గడిచినా తనకి అవకాశం ఇచ్చిన నిర్మాతని మర్చిపోని రజినీకాంత్, ఆగస్టు 14న కలై జ్ఞానం సన్మాన సభలో ఆయన ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నాడని తెలుసుకున్నాడు. ఈ సందర్భంగా తన నిర్మాతకి ఇల్లు కొనిస్తానని రజినీ మాట ఇచ్చారు. సరిగ్గా రెండు నెలలు దాటకుండానే రజినీకాంత్, కలై జ్ఞానంకు చెన్నైలో ఇల్లు కొని ఇచ్చారు. దసరాకు ముందు రోజు రజనీకాంత్ ఆధ్వర్యంలో గృహప్రవేశం కూడా జరిగింది. ఇలా ఎంతమంది హీరోలు, తమకి అవకాశం ఇచ్చిన వారిని గుర్తుంచుకుంటారు. అందుకే రజినీకాంత్ నిజంగానే సూపర్ స్టార్ అయ్యాడు.