కరోనా భయంలో రజినీకాంత్.. ఆ సినిమాకు లాంగ్ బ్రేక్?

rajinikanth

సుపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పట్లో షూటింగ్స్ వెళ్లేలా కనిపించడం లేదు. వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండడానికె ఆయన ఇష్టపడుతున్నారు. శివ దర్శకత్వంలో అన్నాతై సినిమాను మొదలుపెట్టిన తలైవా కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ కి దూరమయ్యారు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా భారీ స్థాయిలో విజృంభిస్తోంది.

అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరో కూడా కరోనా భారిన పడటంతో చాలా వరకు స్టార్స్ రిస్క్ చేయకూడదని డిసైడ్ అయ్యారు. ఇక రజినీకాంత్ ఒకవేళ రెడీగా ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేలా లేరని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రజినీకాంత్ పలు అనారోగ్య సమస్యలతో ఉన్నారు. 69ఏళ్ల తలైవాతో ఏ మాత్రం రిస్క్ చేయవద్దని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. దీంతో జనవరిలో విడుదల చేయాలని అనుకున్న అన్నాతై సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.