సూపర్ స్టార్ కోసం స్టార్ హీరోస్, ఈరోజు సోషల్ మీడియాలో దర్బార్ సునామి

సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కలియికలో రానున్న మొదటి సినిమా దర్బార్ మేనియా మొదలయ్యింది. దాదాపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన మురుగదాస్, సంక్రాంతికి రానున్న ఈ సినిమా ప్రొమోషన్స్ ని మొదలుపెట్టడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. దర్బార్ ప్రొమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్, పాన్ ఇండియా లెవెల్లో ఉన్న టాప్ స్టార్స్ అందరినీ వాడుతున్నారు. హిందీలో దర్బార్ మోషన్ పోస్టర్ ని సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయనుండగా, తమిళ్లో ఉలగనాయగన్ కమల్ హాసన్ విడుదల చేయనున్నాడు. మలయాళ దర్బార్ మోషన్ పోస్టర్ ని మోహన్ లాల్ రిలీజ్ చేయనుండగా, తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్బార్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నాడు.

ఇంతమంది స్టార్ హీరోలు ఒకేసారి రిలీజ్ చేస్తే నేషనల్ వైడ్ దర్బార్ సినిమా పేరు మోగిపోతుంది. కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది కాబట్టే చిత్ర యూనిట్ ఈ స్కెచ్ వేసినట్లు ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5:30నిమిషాలకి ఈ టాప్ స్టార్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ మోషన్ పోస్టర్ ని ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మురుగదాస్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో రజిని మేనియా మొదలయ్యింది, ఈవెనింగ్ కల్లా అది పీక్ స్టేజ్ లోకి వెళ్లనుంది. అనిరుద్ సూపర్బ్ మ్యూజిక్ తో రానున్న దర్బార్ మోషన్ పోస్టర్ మనం కూడా వెయిట్ చేద్దాం.