రజనీ ‘రానా’ను లైన్లో పెట్టిన కేఎస్ రవికుమార్

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. అయితే అనారోగ్య కారణాలతో రజనీ ఇక సినిమాలు చేయరనే వార్తలు తమిళ మీడియాలో జోరుగా వస్తున్నాయి. కానీ కేఎస్ రవికుమార్‌తో రజనీ సినిమా చేయనున్నారనే వార్తలొస్తున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం రజనీ-కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో రానా అనే సినిమా ప్రారంభమైంది.

KS RAVIKUMAR RANA MOVIE

కానీ ఆ తర్వాత రజనీ అనారోగ్యం పాలవ్వడంతో సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత రానా సినిమాను పక్కన పెట్టి ‘అన్నాత్తే’ సినిమాను రజనీ ఒకే చేశారు. దీంతో ‘రానా’ సినిమా ఆగిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ ఆగిపోయిన ‘రానా’ సినిమాను మళ్లీ పట్టాలెక్కించేందుకు కేఎస్ రవికుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల రజనీతో రానా సినిమాపై కేఎస్ రవికుమార్ చర్చించారు. ఆగిపోయిన సినిమా మళ్లీ మొదలుపెట్టేందుకు రజనీ కూడా ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.