
నితిన్, శ్రీలీల జంటగా నటిస్తూ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం రాబిన్ హుడ్. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ సమయంలో నటుడు రాజేంద్రప్రసాద్ ఈ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన సన్నివేశాలను మీడియా వారితో పంచుకోవడం జరిగింది.
అదే సందర్భంగా ఆయన గతంలో చేసిన కొన్ని సినిమాలు గురించి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించిన చిత్రంలోని సంఘటన గురించి ఆయన పంచుకోవడం జరిగింది. ఒకటే ఊరు నుండి రావడంతో నందమూరి తారక రామారావు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రామారావు గారితో నటించిన ఒక సినిమాలో తాను ఒక దేశానికి రాజుని అని, కాకపోతే రామారావు గారి ఎదురుగా నటించడంతో చాలా తగ్గి ఉండటం రామారావు గమనించారు. వెంటనే రామారావు గారు తన దగ్గరకు వచ్చి వీపు మీద గట్టిగానే ప్రేమతో ఒక దెబ్బ వేశారు. ఆ దెబ్బతిన్న వెంటనే నేను చాలా స్టిఫ్ గా నించున్నాను. ఒక దేశపు రాజు అంటే ఇలా స్టిఫ్ గా ఉండాలి. నువ్వు ప్రసాద్ అనే విషయాన్ని, నేను రామారావు అనే విషయాన్ని మరిచిపోయి నటించు అని అన్నారు. ఆ సంఘటన నేను జీవితంలో మర్చిపోలేను అని అన్నారు. ఆయన నాకు దైవ సమానులు.

అదేవిధంగా కృష్ణ గారితో కేవలం ఒక్క సీన్ లో నటించడం వల్ల నాకు 14 సినిమాలలో అవకాశం వచ్చేలా చేశారు. నేను సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి నటించిన తొలి చిత్రంలో నా పాత్ర చాలా చిన్నది. కానీ తొలి షాట్ లోనే నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూసి ఆయన ముదుడయ్యారు. వెంటనే తన తర్వాత చిత్రంలో కూడా తన బావమరిది పాత్ర నాకే ఇవ్వమని దర్శకుడుతో అన్నారు. అదేవిధంగా ఆ తర్వాత కూడా మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా మొత్తానికి కృష్ణగాడి వల్ల నాకు 14 సినిమాలు వచ్చాయి. ఆయన మీరు నేను జన్మలో మర్చిపోలేను అన్నారు.