ఆరోజు అల్లు అర్జున్ డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయాం

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వెంకి కుడుముల రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం రాబిన్ హుడ్. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తూ జివి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తూ వస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, దయానంద్ రెడ్డి, లాల్, శుభలేఖ సుధాకర్, కేశవ్ దీపక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారితో మీడియా వారు సమావేశం కాగా ఆయన అనుకోకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు. ఆయనతో నటించిన నటీనటుల గురించి చెప్తూ మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి డాడీ చిత్రంలో నటిస్తున్న సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుండగా అల్లు అరవింద్ గారు వచ్చారు. తన బావ అయిన చిరంజీవితో మాట్లాడతారు అనుకుని నేనూ పక్కకి వెళ్తుండగా నన్ను కూడా అక్కడే ఉండమని చెప్పారు. వెంటనే తన కొడుకు అల్లు అర్జున్ ను నాకు పరిచయం చేసి తను డ్యాన్స్ చేస్తాను అంటున్నాడు, మీరు చూడాలి అని అడిగారు. దానితో సరే అని అల్లు అర్జున్ డ్యాన్స్ చూస్తుండగా ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ ఒక్కటే చేతిపై కాళ్ళు పైకి పెట్టు డ్యాన్స్ చేసిన విధానం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడే అనుకున్నాము ఇతను కచ్చితంగా భవిష్యత్ లో ఉన్నత స్థాయికి వెళ్తాడు అని. అంత గొప్పగా డ్యాన్స్ చేశాడు. అదే విధంగా జులాయి చిత్ర సమయంలో నన్ను గురువు గారు అంటూ ఎంతో ప్రేమగా పలకరిస్తూ నటనకు సంబంధించి కొన్ని టిప్స్ అడిగేవాడు. డైరెక్టర్ చెప్తారు కదా అంటే లేదు డైరెక్టర్ గారు మిమ్మల్ని అడిగి తెలుసుకున్నారు గురువు గారు అంటూ ఎంతో ప్రేమగా నాతో ఉండేవాడు. నేను అంటే అల్లు అర్జున్ కు ఎంతో ప్రేమ, గౌరవం అని అల్లు అర్జున్ గురించి చెప్పారు.