గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ హీరో ‘కిరణ్ అబ్బవరం’!!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రేడియో జాకీ చైతు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు రాయచోటిలో తన నివాసంలో మొక్కలు నాటిన యువ హీరో కిరణ్ అబ్బవరం.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు లేనిదే మానవ మనుగడ లేదు అని మానవుడు జీవించాలంటే తప్పకుండా ఆక్సిజన్ అవసరం కాబట్టి మనందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు.