Tollywood: నేడు రాజ‌శేఖ‌ర్ బ‌ర్త్‌డే.. ఫ్యాన్స్ క‌నిపించే దేవుళ్లు అంటూ న్యూ మూవీ పోస్ట‌ర్ రిలీజ్‌!

Tollywood: సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ప్రొడ్యుస‌ర్స్ కౌన్సిల్ త‌ర‌పున ఆయ‌న‌కు బ‌ర్త‌డే విషేస్ తెలుపుతూ.. తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కుంటూ ప్ర‌త్యేక మార్కెట్ సంపాదించుకున్న హీరో రాజ‌శేఖ‌ర్‌. అప్ప‌ట్లో రాజ‌శేఖ‌ర్ త‌న సినిమాల‌తో సంచ‌ల‌నాలు సృష్టించాడు. హీరో రాజ‌శేఖ‌ర్‌.. అంకుశం, ఆవేశం, ఆహుతి లాంటి సినిమాల‌తో యాంగ్రీ స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్నాడు. 90ల్లో ఈయ‌న సినిమాలు వ‌స్తే బాక్సాఫీస్ షేక్ అయ్యేది.

అన్న, అల్ల‌రి ప్రియుడు లాంటి సంచ‌ల‌న సినిమాల్లో న‌టించాడు. Tollywood అలాగే మ‌న‌సున్న మారాజు, మా అన్న‌య్య, సింహ‌రాశి వంటి చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు రాజ‌శేఖ‌ర్‌. అయితే ఓ ద‌శ‌లో రాజ‌శేఖ‌ర్‌కు వ‌రుస ప్లాప్‌లు వ‌చ్చాయి.. క‌నీసం ఆయ‌న సినిమాలు వ‌చ్చిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే సొంత నిర్మాణ సంస్థ‌ల్లో సినిమాలు తీసి చాలా న‌ష్ట‌పోయాడు రాజ‌శేఖ‌ర్‌. కానీ ఈయ‌న Tollywood కెరీర్ మ‌ళ్లీ పుంజుకుంది. ఎవ‌డైతే నాకేంటి, గోరింటాకు, గరుడ‌వేగ‌, క‌ల్కి వంటి సినిమాల‌తో మ‌ళ్లీ త‌న స్టార్‌డ‌మ్‌ను ప్రేక్ష‌కుల్లో చూపించారు. ఇక ఇటీవ‌లే రాజ‌శేఖ‌ర్ క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. త‌న‌తో పాటు భార్య జీవిత‌, కుమార్తెలు శివాని, శివాత్మిక క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో సెంట‌ర్ హాస్పిట‌ల్‌లో చేర‌గా.. క‌రోనా నుంచి జీవిత‌, శివాత్మిక‌, శివాని కోలుకున్నా.. రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం మాత్రం ఆందోళ‌న‌రంగా మారిన విష‌యం తెలిసిందే. మెరుగైన చికిత్స అనంత‌రం రాజ‌శేఖ‌ర్ ఆరోగ్య కుద‌ట‌ప‌డింది. క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక‌.. కొంత విశ్రాంతితో మ‌ళ్లీ సినిమా షూటింగ్‌లో బిజీ అయ్యాడు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం శేఖ‌ర్‌. Tollywood ఈ చిత్రం రాజ‌శేఖ‌ర్‌కు 91వ మూవీ కాగా.. Tollywood ఈ చిత్ర పోస్ట‌ర్‌ను రాజ‌శేఖ‌ర్ బ‌ర్త్‌డే కానుక‌గా రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ సంద‌ర్భంగా రాజ‌శేఖ‌ర్ స్పందిస్తూ.. ప్రియాయాతి ప్రియ‌మైన‌, న‌న్ను ప్రేమించే నా అభిమానుల‌కు.. అతి భ‌యంక‌ర‌మైన క‌రోనా.. న‌న్ను మ‌ర‌ణ‌పు స‌రిహ‌ద్దుల్లోకి తీసుకెళ్లినా, మీ ప్రేమ‌, అభిమానం, నిరంత‌ర ప్రార్థ‌న‌ల‌తో న‌న్ను మ‌ళ్లీ ఈ నా పుట్టిన‌రోజు నాడు, ఒక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించే స్థితికి తీసుకొచ్చాయి. క‌నిపించ‌ని ఆ దేవుడికి, క‌నిపించే దేవుళ్లు అయినా మీకు స‌దా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటూ, ఎల్ల‌ప్పుడూ మీకు రుణ‌ప‌డిఉంటాను అంటూ రాజ‌శేఖ‌ర్ పేర్కొన్నారు. ఇక Tollywood ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది.