Rajanikanth: ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రాన‌ని చెప్ప‌లేదు.. కానీ: ర‌జ‌నీ స‌న్నిహితుడు

Rajanikanth: కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇటీవ‌లే కొంత అనారోగ్యానికి గురైన విష‌యం తెలిసిందే. దీంతో అనారోగ్య కార‌ణాల దృష్టిలో వుంచుకుని పాలిటిక్స్‌లోకి రావ‌డం లేదు అని త‌లైవా ప్ర‌క‌టన చేయ‌డంతో.. కొంత మంది ర‌జ‌నీ ఫ్యాన్స్ నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేశారు. దీంతో Rajanikanth ర‌జ‌నీ మ‌రోసారి త‌న రాజ‌కీయ స్టేట్‌మెంట్ ఇచ్చారు.. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీ పేరిట ఉన్న మ‌క్క‌ల్ మండ్రం నాయ‌కులు, అభిమాన సంఘాలు నిర్వాహ‌కులు విర‌క్తితో ఇత‌ర పార్టీల్లో చేరుతున్నారు.

దీనిపై స్పందించిన ర‌జ‌నీ స‌న్నిహితుడు గాంధీ మ‌క్క‌ల్ ఇయ‌క్కం నేత త‌మిళురువి మ‌ణియ‌న్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో Rajanikanth ర‌జ‌నీ ఆరోగ్య ప‌రిస్థితుల కార‌ణంగా ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లు రాజ‌కీయ పార్టీని ప్రారంభించ‌డంలేద‌ని మాత్ర‌మే తెలిపిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. అయితే రజ‌నీ మ‌క్క‌ల్ మండ్ర‌ల్ నాయ‌కులు.. గాంధీ మ‌క్క‌ల్ ఇయ‌క్క‌మ్‌లో స‌భ్య‌త్వం క‌ల్పించాల‌ని త‌న‌ను కోరుతున్నార‌ని ఆయ‌న అన్నారు. దీంతో వారికి నేనోక‌టే చెప్ప‌దలుచుకున్నా..గాంధీ మ‌క్క‌ల్ ఇయ‌క్క‌మ్‌ను ప్ర‌జాసేవ కోస‌మే న‌డుపుతున్నాన‌ని.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు కాద‌ని అన్నారు. Rajanikanth ర‌జ‌నీ పార్టీని ప్రారంభించ‌డం లేద‌ని మాత్ర‌మే చెప్పార‌ని, ఎక్క‌డా తాను రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌న‌ని ప్ర‌క‌టించ‌లేద‌ని.. కాక‌పోతే ర‌జ‌నీ మాత్రం మ‌క్క‌ల్ మండ్రాల‌ను కొన‌సాగిస్తున్నార‌ని, ఈవిష‌యాన్ని ర‌జ‌నీ అభిమానులు గుర్తుంచుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ర‌జ‌నీ అభిమాన సంఘాల నాయ‌కులు ప‌లు పార్టీల్లో చేర‌డంపై త‌న‌కెంతో ఆవేద‌న క‌లిగిస్తోంద‌ని త‌మిళుర‌వి మ‌ణియ‌న్ అన్నారు.