ప్రాధాన్యతను సంతరించుకున్న అభిమానులతో రజనీ భేటీ

11న రాజకీయ పార్టీ గురించి ప్రకటన చేయనున్నట్లు ఇటీవల కోలీవుడ్ సీనియర్ హీరో రజనీకాంత్ చేసిన ట్వీట్ తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు రజనీ ఆ ట్వీట్‌లో ప్రకటించారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో రజనీ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం తమిళ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో రజనీ పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోండగా.. ఆయన సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు.

రజనీకి ఉన్న అభిమానులు సౌత్ ఇండియాలో ఏ హీరోకు లేరు. ఇక తమిళనాడు అయితే రజనీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. దీంతో రజనీ సీఎం అవువతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 31న రాజకీయ ప్రకటన చేయనున్న క్రమంలో రజనీ కాంత్ తాజాగా మరోసారి అభిమానుల సంఘాలతో భేటీ అయ్యారు. ఈ భేటీ ఇఫ్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.

చెన్నైలోని కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమాన సంఘాల నాయకులతో రజనీ సమావేశం అయ్యారు. రజనీ అత్యంత సన్నిహితుడు అర్జున మూర్తితో పాటు తమిళ్రూవి మణియన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై అభిమానులతో రజనీకాంత్ ఈ సమావేశం చర్చించారని తెలుస్తోంది పార్టీ విధివిధానాలతో పాటు ఎన్నికల్లో పోటీపై చర్చించినట్లు సమాచారం.