Superstar: ఈ అవార్డు ఆ బ‌స్సు డ్రైవ‌ర్‌కు అంకితం.. ర‌జ‌నీకాంత్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌!

Superstar: సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు సినీ రంగంలో అత్యున్న‌త పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌లు భాష‌ల సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. దీనిపై తాజాగా Superstar ర‌జ‌నీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలుపుతూ.. సినీ ఇండ‌స్ట్రీలో అత్యున్న‌త పుర‌స్క‌ర‌మైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు న‌న్ను ఎంపిక చేసిన భార‌త ప్ర‌భుత్వానికి, గౌర‌వ‌నీయులైన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ, కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్‌, ఇత‌ర జ్యూరీ స‌భ్యుల‌కు నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు.. నాలోని న‌టుడ్ని గుర్తించి న‌న్ను ఎంత‌గానో ప్రోత్సాహించిన బ‌స్సు డ్రైవ‌ర్ నా స్నేహితుడు రాజ్ బ‌హ‌దూర్‌..

rajani

పేద‌రికంలో ఉన్న‌ప్ప‌టికీ న‌న్ను న‌టుడ్ని చేయ‌డం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్ద‌న్న‌య్య స‌త్య‌నారాయ‌ణ‌రావు గైక్వాడ్‌, అలాగే ఈ ర‌జ‌నీకాంత్‌ను సృష్టించిన నా గురువు బాల‌చంద‌ర్‌తో పాటు.. నాకు జీవితాన్ని ఇచ్చిన నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, థియేట‌ర్ య‌జ‌మానులు, మీడియా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్‌కు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను అంటూ పేర్కొన్నాడుSuperstar. అదేవిధంగా త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి, ఉప ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వ‌న్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు ఇత‌ర రాజ‌కీయ‌, సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు జై హింద్ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇక ఇదిలా ఉంచితే ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం అన్నాత్తె సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకి జోడీగా న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్ హీరోయిన్ల్‌గా న‌టిస్తున్నారు. అయితే గ‌త కొంత‌కాలంగా ర‌జ‌నీకి ఆరోగ్యం బాలేక‌పోవ‌డంతో ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డ్డ‌.. ఇప్పుడు కోలుకున్న ర‌జ‌నీ వైద్యుల సూచ‌న‌ల‌తో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారుSuperstar .