RRR షూటింగ్ కోసం సిద్దమైన రాజమౌళి.. ఎన్టీఆర్ టీజర్ వచ్చేది ఎప్పుడంటే..

ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ సోమవారం నుంచి స్టార్ట్ చేయాలని ఎస్ఎస్ రాజమౌలి మొత్తానికి ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకున్నారు. ఇది ట్రయల్ షూట్ లాగా ఉంటుందట. 3-4 రోజుల వరకు ప్రధాన నటులు పాల్గొనరు. నెక్స్ట్ వీక్ లోనే ఎన్‌టిఆర్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్‌టిఆర్‌పై కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేయనున్నారు. ఇక ఎన్‌టిఆర్ కొమరం భీమ్‌ ఇంట్రడక్షన్ వీడియో అక్టోబర్ 22 న విడుదల అయ్యే అవకాశం ఉందట.

ఇక మరోవైపు రామ్ చరణ్ ఆచార్యతో బిజీ కానున్నాడు. ఈ హీరో వచ్చే నెల ఏండింగ్ లో ఆర్ఆర్ఆర్ సెట్ లోకి రానున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్న రాజమౌళి అలియా భట్ మరియు ఇతర ప్రధాన నటుల షెడ్యూల్ ని కూడా రెడీ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రం. షూట్ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది విడుదల తేదీని ప్రకటించనున్నారు. దాదాపు రూ .450 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ తో ఆర్‌ఆర్‌ఆర్‌ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.