#RRR అది కాదని తేలిపోయింది… ఇక జక్కన్నే చెప్పాలి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ కి ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి రాజమౌళి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయలేదు. అయితే తమ అభిమాన హీరోలని చూసి చాలా కాలం అయ్యింది అనుకున్నారో లేక కొమరం భీమ్ గా ఎన్టీఆర్, రామరాజు పాత్రలో చరణ్ ఎలా ఉంటారు అనుకున్నారో ఏమో కానీ ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మాత్రం ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చేసి రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఒరిజినల్ పోస్టర్స్ రేంజులో డిజైన్ చేసిన ట్రిపుల్ ఆర్ పోస్టర్స్ చూస్తే రాజమౌళి కూడా మెచ్చుకొక మానడు. ఇదిలా ఉంటే రాజమౌళి పుట్టిన రోజు కావడంతో ఈరోజు ఇండస్ట్రీ వర్గాలు, సినీ అభిమానులు దర్శక ధీరుడికి విషెస్ చెప్పారు. వీరిలో చరణ్ కూడా ఉన్నాడు కానీ ఎన్టీఆర్ లేకపోవడం విశేషం.

RRR title

మళ్లీ ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ రామ రౌద్ర రుషితం అనే పేరు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. అయితే చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు ట్రిపుల్ ఆర్ టైటిల్ అది కాదని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సైరా రిలీజ్ అయ్యి రామ్ చరణ్ ఫ్రీ అయిపోయాడు కాబట్టి తారక్ కి కాస్త రెస్ట్ ఇచ్చి ఆర్ ఆర్ ఆర్ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ లో అలియా భట్ కూడా ఉండే అవకాశం ఉంది.