సాంగ్ తో అదరగొట్టారు… రాజ రాజ చోరా హిట్టే…

ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో శ్రీవిష్ణు. తాజాగా ఈ యంగ్‌ హీరో నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రం ‘రాజ రాజ చోర’.  మేఘా ఆకాశ్‌ – సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఎంటర్టైనర్‌ ని హసిత్‌ గోలి తెరకెక్కిస్తున్నాడు. టైటిల్‌ తోనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసిన మేకర్స్‌ టీజర్ తో ఇంకా ఇంటరెస్ట్ పెంచారు. దొంగగా శ్రీవిష్ణును కొత్తగా చూపించి ఈ సినిమాపై అంచనాలను పెంచారు. ’రాజ రాజ చోర’ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్‌ – అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. దీనికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా.. కీర్తి చౌదరి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్‌. ‘రాజరాజు వచ్చే లోకాలు మెచ్చే.. రాజ రాజ చోర వచ్చే బాధలోన్నో తెచ్చే’ అంటూ సాగిన సాంగ్ కి ఇంస్త్యాంట్ గానే హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. వివేక్ సాగర్ మ్యూజిక్ కి మోహన భోగరపు వాయిస్ బాగా హెల్ప్ అయ్యింది. లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. తనికెళ్ళ భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్,  శ్రీకాంత్‌ అయ్యంగార్, అజయ్‌ ఘోష్, వాసు ఇంటూరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వేదరామన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. విప్లవ్‌ నిషాదం ఎడిటింగ్‌ వర్క్‌ చేస్తున్నారు.