హాలీవుడ్ కు పరిచయమవుతున్న మొట్ట మొదటి తెలుగు తేజం..రాజ్ దాసిరెడ్డి

హాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్న తెలుగు తేజం రాజ్ దాసిరెడ్డి. తను ఇంజినీరింగ్ లో టాపర్ గా నిలిచి, న్యూ యార్క్ ఫిల్మ్ అకాడమీలో  శిక్షణ పొంది హాలీవుడ్ చిత్రం లో నటించే అవకాశం పొందిన మొట్ట మొదటి వ్యక్తి  మన తెలుగు వాడు అవటం విశేషం.ఈ రోజు మన తెలుగు తేజం రాజ్ దాసిరెడ్డి పుట్టిన రోజు జరుపుకోనున్నారు. తను నటించే ఈ సినిమాకు సినీమణి నిర్మాత కమ్ డైరెక్టర్ అయిన మైఖేల్ బే ప్రొడ్యూస్ చేస్తుండగా, AMC థియేటర్స్ చైన్ ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా .

నటుడు రాజ్ దాసిరెడ్డి మాట్లాడుతూ… తెలుగువాడైన నాకు హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం రావడం నాకు కల లా ఉంది.అలాగే ఈ చిత్రంలో నటిస్తుండగానే  మరో హాలీవుడ్ మూవీ లో కుడా నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.నాకిలాంటి మంచి అవకాశ మిచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు , మరియు నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మా తల్లితండ్రలకు  నా పాదాభి వందనాలు.అలాగే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో  తెలియజేస్తామని అన్నారు.