రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు గ్రహీత మల్లెమాల సుందర రామిరెడ్డి గారు

రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు గ్రహీత మల్లెమాల సుందర రామిరెడ్డి గారు అంటే ఎమ్.ఎస్. రెడ్డి గారు గొప్ప నిర్మాత, దర్శకులు స్క్రీన్ ప్లే రచయిత 15/08/1924 లో జన్మించారు.. ఆంధ్ర ప్రదేశ్ ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా కూడా చేశారు.. అన్నిటికీ మించి అజాత శత్రువు.. వంశీ సంస్థను ఆదరించేవాడు, సాహిత్యం పట్ల అమితమైన అభిమానం..జూబ్లీహిల్స్ లో వారి ఇల్లు, సినారె గారిల్లు పక్క పక్కన ఉండేవి.. ఎన్నో విశిష్ట గుణాలు గల ఎమ్ ఎస్ రెడ్డి గారు వంశీ సంస్థకు ఆప్తులు, వ్యక్తిగతంగా నన్నెంతో అభిమానించే వారు.. మా ఆవిడ తెన్నేటి సుధ రచయిత్రి అని తెలిసి ఆమె రాసిన పుస్తకాలు తీసుకుని చదివి విశ్లేషించేవారు.. ముఖ్యంగా బలిజేపల్లి వారి మీద రాసిన ఆమె పరిశోధన గ్రంథం అడిగి తీసుకుని ప్రశంసించారు..👏

Mallemala Sundara Ramireddy

మీరు చూస్తున్న ఫోటో లో వంశీ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్ ఎస్ రెడ్డి గారు, మోహన్ బాబు గారు, దైవజ్ఞ శర్మ గారు, కె వి భాస్కర్ రావు గారు, ఎం వి నారాయణ రావు గారు ఉన్నారు.. ఆయన 11 /12/ 2011 నాడు పరమపదించారు..😥

ఎమ్మెస్ రెడ్డి గారు నేను చేస్తున్న దివ్యాంగుల సేవ గురించి ఎప్పుడూ ప్రశంసించే వారు “నీ జన్మ ధన్యమైందయ్యా” అనే వారు..🥰

ఎమ్మెస్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి వంశీ నివాళులు సమర్పిస్తున్నది..
🙏🙏🙏