దుబ్బాకపై కమల జెండా

ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజీపీ విజయ ఢంకా మోగించింది. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు టీఆర్‌ఎస్‌పై 1470 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు తీవ్ర సస్పెన్స్ మధ్య కౌంటింగ్ జరిగింది. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. కొన్ని రౌండ్లలో బీజేపీ, మరికొన్ని రౌండ్లలో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ రావడంతో చివరి వరకు ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మాత్రం సాగింది.

అయితే చివరకు బీజేపీ అభ్యర్థి రఘునందనరావు టీఆర్‌ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. రఘునందనరావు విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో ముగినిపోయారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యలయంలో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి.

దుబ్బాక విజయంతో బీజేపీ శ్రేణులు ఆనందోత్సహాల్లో ఉన్నారు. రాబోయో జీహెచ్‌ఎంసీ, సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.